జూన్ నెలతో పోల్చుకుంటే కాస్త ఎక్కువగానే ఉంది

     Written by : smtv Desk | Wed, Aug 01, 2018, 04:45 PM

జూన్ నెలతో పోల్చుకుంటే కాస్త ఎక్కువగానే ఉంది

న్యూదిల్లీ, ఆగస్టు 01 : గత సంవత్సరం కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు జులై నెలలో రూ.96,483 కోట్లకు చేరాయి. జూన్‌ నెలతో పోల్చుకుంటే ఈ మొత్తం కాస్త ఎక్కువగా ఉంది.

జూన్‌ నెల వసూళ్లు రూ. 95,630కోట్లు. అలాగే 2017 ఆర్థిక సంవత్సరం (జులై, 2017 నుంచి మార్చి,2018) లో వసూలైన సరాసరి కంటే ఈ మొత్తం ఎక్కువగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.89,885 కోట్లు వసూలయ్యాయి.

పన్నుల వ్యవస్థలో సంస్కరణలు (జులై,2017) తీసుకొచ్చి ఒక సంవత్సరం గడిచిన సందర్భంగా జులై లో ఆర్థిక కార్యదర్శి హస్ముఖ్ అథియా మాట్లాడుతూ... జీఎస్టీ కింద నెలకు లక్ష కోట్ల రూపాయలు వసూలు చేయడమనేది నిబంధన కాదు. కానీ ప్రభుత్వం ప్రతి నెలా అంత మొత్తం వసూలు ఉండాలనుకుంటోందని అన్నారు.

చివరగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వ్యాపారులు రిటర్న్‌లు దాఖలు చేసే విషయంలో కొన్ని సడలింపుల్ని తీసుకొచ్చింది. ఆ సమయంలో కొన్ని వస్తువుల మీద పన్నులు తగ్గించింది. 28 శాతం పన్ను స్లాబు కింద ఉన్న వస్తువులకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది.





Untitled Document
Advertisements