చేనేత కళాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుంది

     Written by : smtv Desk | Wed, Aug 08, 2018, 07:00 PM

చేనేత కళాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుంది

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్.. చేనేత కళాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం చేనేతల ప్రభుత్వమని కేటీఆర్ ఉద్ఘాటించారు.సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.Untitled Document
Advertisements