ఎన్టీఆర్ గెటప్‌‌లో బాలయ్య స్టన్నింగ్ లుక్

     Written by : smtv Desk | Tue, Aug 14, 2018, 08:15 PM

ఎన్టీఆర్ గెటప్‌‌లో బాలయ్య స్టన్నింగ్ లుక్

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు పెరుగుతున్నాయి. క్రిష్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాక ఓ వైపు నటీనటుల ఎంపికతో పాటు మరోవైపు షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఆయన ఎక్కువగా ధరించిన కాషాయ బట్టల్లో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న ఆయన కుమారుడు బాలకృష్ణ అచ్చం ఎన్టీఆర్ లా కనిపిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ మూవీ షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తైంది. ఆగష్టు 13 నుండి సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. వారాహి చలనచిత్ర, విబ్రి మీడియా సమర్పణలో సాయి కొర్రపాటి, విష్ణు వర్థన్ ఇందూరి, నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంతోష్ తుండియల్ ఛాయాగ్రహణం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మూవీ జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Untitled Document
Advertisements