చంద్రబాబు వరాల జల్లు

     Written by : smtv Desk | Thu, Aug 23, 2018, 05:29 PM

చంద్రబాబు వరాల జల్లు

చిన్న సినిమాపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ 4 కోట్ల లోపు బడ్జెట్ లో నిర్మించే చిత్రాలని ఏపీ ప్రభుత్వం చిన్న చిత్రాలుగా పరిగణించనుంది. ఈ చిత్రాలకు స్టేట్ జీఎస్టీ నుంచి కల్పిస్తారు.

చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన వరాల వివరాలు:

ఏపీలోని ప్రాంతాల్లో చిన్న సినిమాల చిత్రీకరణలకు ఉచితంగా అనుమతులు. అయితే… ముందుగా నిర్మాతలు ఎఫ్‌డీసీ (ఫిలిం డెవ‌ల‌ప్‌మెంట్‌ కార్పొరేషన్)కి కాషన్ డిపాజిట్ చెల్లించాలి. చిత్రీకరణ పూర్తయిన తరవాత ఆ డబ్బును నిర్మాతకు తిరిగి ఇచ్చేస్తారు.

చిన్న చిత్రాలకు జీఎస్టీ మినహాయింపు. ప్రస్తుతం సినిమాలపై 19 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అందులోని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వాటా 9 శాతాన్ని తొలగించనున్నారు.

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, నైతిక విలువలతో కూడిన 15 చిత్రాలకు రూ. 10 లక్షల ప్రోత్సాహం. ఏడాదికి 15 చిన్న చిత్రాలకు ఈ నగదు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. ఆ చిత్రాలను ఎంపిక చేయడానికి త్వరలో కమిటీ వేయనున్నారు.
ఏపీ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు అందుకోవాలంటే కొన్ని నిబంధనలు వున్నాయి. అవేంటంటే…

ఏపీలోనే చిన్న సినిమా చిత్రీకరణ చేయాలి. నిర్మాణాంతర కార్యక్రమాలు, డబ్బింగ్ కూడా అక్కడే చేయాలి.

నటీనటుల పారితోషకం వివరాలు తప్ప మిగిలిన ఖర్చుల వివరాలను ఎఫ్‌డీసీకి ముందుగా తెలియజేయాలి.





Untitled Document
Advertisements