మళ్లీ కోహ్లీనే నంబర్‌వన్‌

     Written by : smtv Desk | Thu, Aug 23, 2018, 07:25 PM

మళ్లీ కోహ్లీనే నంబర్‌వన్‌

ప్రస్తుత సిరీస్‌లో అదరగొడుతున్న కోహ్లి.. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ఆగ్రస్థానాన్ని ఆక్రమించాడు. 937 పాయింట్లతో టెస్టు నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 929 పాయింట్లతో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ రెండో స్థానానికి పడిపోయాడు . కోహ్లీ టెస్టు కెరీర్‌లోనే ఇన్ని రేటింగ్‌ పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. అత్యధిక రేటింగ్‌ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం 11వ స్థానంలో నిలిచాడు. మరొక్క పాయింట్‌ సాధిస్తే ఆల్‌టైమ్‌ అత్యధిక రేటింగ్‌ పాయింట్లు సాధించిన టాప్‌ 10 ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదిస్తాడు. డాన్‌ బ్రాడ్‌మన్‌ (961), స్టీవ్‌ స్మిత్‌(947)లు ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 97, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు సాధించడంతో తిరిగి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అంతకుముందు ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు అనంతరం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో కోహ్లీ మొదటిసారి టెస్టుల్లో నంబర్‌వన్‌ ర్యాంకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements