సూపర్ స్టార్ తో సెన్సేషనల్ స్టార్

     Written by : smtv Desk | Fri, Aug 24, 2018, 12:07 PM

సూపర్ స్టార్ తో సెన్సేషనల్ స్టార్

గీత గోవిందం’తో మరో విజయాన్ని సొంతం చేసుకున్న టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.కాగా తాజాగా స్టార్ హీరో మహేశ్ బాబు సెట్‌లో దర్శనమిచ్చాడు విజయ్ దేవరకొండ.

సూపర్ స్టార్‌ మహేష్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం మహర్షి. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. అక్కడికి వెళ్లి హల్‌చల్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విజయ్ దేవరకొండ.. ‘‘ఒకప్పుడు అతడి సినిమాల టికెట్ల కోసం ఫైట్ చేసేవాడిని. ఇప్పుడు ఆయన మూవీ సెట్‌లో ఆయనతో పాటు నా పని గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఫుల్ లవ్’’ అంటూ కామెంట్ పెట్టాడు.

గీత గోవిందం ఇటీవలె విడుదలై మంచి బాక్స్‌ ఆఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.Untitled Document
Advertisements