హైదరాబాద్ కు వచ్చేస్తున్న మలయాళీ భామ

     Written by : smtv Desk | Fri, Aug 24, 2018, 01:34 PM

హైదరాబాద్ కు వచ్చేస్తున్న మలయాళీ భామ

కేవలం ఒకే ఒక కన్నుగీటుతో దేశమంతా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కేరళ భామ ప్రియా వారియర్ హైదరాబాద్‌కు వచ్చేస్తోంది. ఈ నెల 26న నగరంలో జరిగే 16వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు ఆమె హాజరు కానుంది.

సంతోషం అధినేత సురేష్ కొండేటి అఫీషియల్‌గా ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఆమె మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో విడుదల చేశారు. వెంకటేష్, రామ్ చరణ్, ప్రభాస్, సమంత, విజయ్ దేవెరకొండ, తమన్నా, సాయిపల్లవిలు వివిధ కేటగిరిలో నామినేట్ అయ్యారు.JRC కన్వెన్షన్ లో జరగబోయే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. ప్రతిష్టాత్మకంగా జరుగనున్న ఈ అవార్డుల ఫంక్షన్ భారీగా జరపబోతున్నట్లుగా ఇప్పటికే ఆయన తెలిపారు.

‘ఒరు ఆడార్ లవ్’ మూవీలోని మాణిక్య మలరాయ పూవీ అనే పాటలో ప్రియ కన్నుకొడుతున్న సీన్ కుర్రకారుకు బాగా నచ్చేయడం తెలిసిందే. ఇది ఇస్లాంకు అభ్యంతరకంగా ఉందంటూ హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా ఆమెపై కేసులు నమోదయ్యాయి. అయితే వాటిని కోర్టులు కొట్టిపారేశాయి.

Untitled Document
Advertisements