చిరంజీవిని కలిసిన ఏపీ మంత్రి అఖిల ప్రియ

     Written by : smtv Desk | Fri, Aug 24, 2018, 03:57 PM

చిరంజీవిని కలిసిన  ఏపీ మంత్రి అఖిల ప్రియ

హైదరాబాదులోని చిరంజీవి నివాసానికి వెళ్లి ఏపీ మంత్రి అఖిల ప్రియ ఆమెతో పాటు ఆమె సోదరి మౌనిక, ఆమె భర్త గణేష్ రెడ్డి, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి తన వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందించారు. వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ నెల 29న అఖిలప్రియ వివాహం పారిశ్రామికవేత్త భార్గవ్ రామ్ తో జరగనుంది. ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో వీరి వివాహానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
చిరంజీవిని ఆహ్వానించిన విషయాన్ని అఖిలప్రియ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రను పోషిస్తున్న చిరుకు అభినందనలు తెలిపారు. 'సైరా' సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Untitled Document
Advertisements