టీవీఎస్ నుండి సరికొత్త రేడియాన్ బైకు

     Written by : smtv Desk | Fri, Aug 24, 2018, 05:31 PM

టీవీఎస్ నుండి సరికొత్త రేడియాన్ బైకు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ గురువారం విపణిలోకి సరికొత్త బైక్‌ను విడుదల చేసింది. 'రేడియాన్‌' పేరుతో దీనిని మార్కెట్లోకి విడుదల చేసినట్టుగా టీవీఎస్‌ వెల్లడించింది.వీఎస్ రేడియాన్ బైకు ప్రారంభ ధర రూ. 48,400 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

కార్‌ తరహా స్పీడోమీటర్, పెద్ద సీటు, క్రోమ్‌ సైలెన్సర్, స్మార్ట్‌ ఫోన్‌ చార్జర్, ట్యూబ్‌లెస్‌ టైర్లు, లీటరుకు 69.3 కిలోమీటర్ల మైలేజి వంటి ఫీచర్స్‌ ఇందులో ఉంటాయి. త్వరలోనే విక్రయాలు ప్రారంభించనున్నట్లు, తొలి ఏడాదిలో రెండు లక్షల వాహనాల అమ్మకాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కంపెనీ జాయింట్‌ ఎండీ సుదర్శన్‌ వేణు గురువారం విలేకరులకు తెలిపారు.

Untitled Document
Advertisements