ట్రంప్‌ హెచ్చరిక

     Written by : smtv Desk | Fri, Aug 24, 2018, 07:36 PM

ట్రంప్‌ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ఆరోపణలు చేసారు. తన అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్టయితే అమెరికా మార్కెట్లు కుప్ప కూలుతాయని ట్రంప్‌ హెచ్చ రించారు.

'నా ప్రతిష్టను దిగజార్చేందుకు కొంతమంది లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. అధ్యక్ష పదవి నుంచి నన్ను తొలగించాలని కుట్రపన్నారు. ఇదే గనుక జరిగినట్టయితే అమెరికా స్టాక్‌మార్కెట్లు కుప్పకూలడం ఖాయం' అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ పేర్కొన్నారు.

తనను ఎప్పుడైనా అభిశంసించాలని అనుకుంటే అమెరికా మార్కెట్లు కుప్పకూలుతాయి. అందరూ చిక్కుల్లో పడతారు. మీరు ఊహించని ఫలితాలు ఉంటాయి అని ట్రంప్‌ ఫాక్స్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ అనే కార్యక్రమంలో ట్రంప్‌ పేర్కొన్నారు.

Untitled Document
Advertisements