నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్ రాఖీలు వచ్చేస్తున్నాయి

     Written by : smtv Desk | Sat, Aug 25, 2018, 12:34 PM

నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్ రాఖీలు వచ్చేస్తున్నాయి

శ్రావణ పౌర్ణమి రోజున వచ్చే రక్షాబంధన్ రంగు రంగుల దారాలతో ముడిపడి ఉంది. రాఖీలో ఉండే దారాలు అన్నా, చెల్లెళ్లు, అక్కాతముళ్ల అనుబంధానికి గుర్తులాంటివి. అందుకే ఈ రాఖీలను పవిత్రంగా భావిస్తారు.ఆదివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇప్పటికే షాపింగ్‌ సెంటర్లు, బంగారు దుకాణాలు, స్వీట్‌హౌస్‌లకు పండుగ కల వచ్చేసింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్లు, వివిధ వెరైటీలతో వ్యాపరస్తులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బంగారు పూత మిఠాయిలు, సిల్వర్‌ స్వీట్స్‌ వంటి వెరైటీలు మార్కెట్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సూరత్‌లోని బంగారు దుకాణం యజయాని ఇలాంటి విభన్న ప్రయత్నమే చేశాడు.

ప్రధాని నరేంద్రమోదీ, యూపీ యోగి ఆదిత్యనాథ్, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీల చిత్రాలతో కూడిన బంగారు రాఖీలను తయారు చేయించాడు. ఇప్పడు గుజరాత్‌లో వీటికి యమా క్రేజ్‌ వచ్చేసింది. తమ అభిమాన నాయకుల ఫోటోలతో కూడిన రాఖీలకోసం ఆర్డర్‌ ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నారని షాప్‌ యజమాని పేర్కొంటున్నారు.

ఉత్తరం భారతదేశంలో సంప్రదాయమైన ఇప్పుడు రక్షాబంధన్ పండుగ దేశమంతట ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. చెల్లెలు రాఖీ కట్టిందటే సర్వకాలం సర్వావస్థలలోనూ రక్షగా ఉండమని అన్నయ్యను కోరడమని అర్థం. అలాగే అన్నకు అన్నివేళలా రక్షించే శక్తిని ఇవ్వాలని ప్రార్థించడం.

రాఖీ కట్టిన సోదరికి కానుకలివ్వడం మన సంప్రదాయంలో భాగం. అది మిఠాయి కావచ్చు, నగదు కావచ్చు. చెల్లెళ్లకోసం సర్వస్వం త్యాగం చేసినవారు చరిత్రలో ఉన్నారు. దానవుల నుంచి రక్షణకోసం శచీదేవి ఇంద్రుడికి, యుద్ధంలో విజయంకోసం కుంతీదేవి అభిమన్యుడికి, విజయంకలగాలని ఖడ్గానికి శివాజీ కట్టారు.





Untitled Document
Advertisements