బ్యూటీషియన్‌ పద్మ నుదుటిపై ఎస్ అక్షరం

     Written by : smtv Desk | Sun, Aug 26, 2018, 11:13 AM

బ్యూటీషియన్‌ పద్మ నుదుటిపై ఎస్ అక్షరం

గన్నవరంలోని బాపులపాడులో బ్యూటీషియన్‌ పిల్లి పద్మపై హత్యాయత్నం జరిగింది. ప్రియుడు నూతన్ కుమార్ పద్మ కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో దాడి చేశాడని అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలపాలై కొనఊపిరితో రక్తపు మడుగులో పడి ఉన్న పద్మను స్థానికులు, పోలీసులు 108 ద్వారా విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

భర్తతో విభేదాలు వచ్చి, మరో యువకుడితో సహజీవనం చేస్తున్న బ్యూటీషియన్ పద్మ కేసులో, ఆమెను కట్టేసి, కత్తితో దారుణంగా దాడి చేసిన తరువాత, ఆమె నుదుటిపై 'ఎస్' అన్న అక్షరాన్ని చెక్కడం చూస్తుంటే, నిందితుడు అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు.ఎందుకంటే పద్మను దుర్మార్గంగా హింసించిన దుండగుడు ఆమె నుదుటిపై 'ఎస్‌' అనే అక్షరం ఆకారంలో కత్తితో చెక్కాడు. అసలే కత్తిపోట్లతో తట్టుకోలేని బాధను అనుభవిస్తున్న పద్మ నుదుటిపైనా కత్తితో చెక్కడంతో తీవ్రమైన క్షోభను అనుభవించింది. స్థానికులు గమనించి అత్యంత విషమంగా ఉన్న పద్మను ఆస్పత్రికి తరలించారు.

కృష్ణా జిల్లా బావులపాడుతో పద్మపై హత్యాయత్నానికి ముందు, ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కిన నిందితుడు, కాళ్లూ, చేతులూ కట్టేసి, బట్టలు ఊడదీసి, చేతులు నరికిన సంగతి తెలిసిందే. ఆమె నుదుటిపై ఉన్న 'ఎస్' అక్షరం వెనకున్న మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.





Untitled Document
Advertisements