చైనాలో అగ్నిప్రమాదం: 19 మంది సజీవ సమాధి

     Written by : smtv Desk | Sun, Aug 26, 2018, 11:52 AM

చైనాలో అగ్నిప్రమాదం: 19 మంది సజీవ సమాధి

చైనాలోని హార్బిన్ నగరంలోని ఓ రిసార్ట్ హోటల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐలాండ్ రిక్రియేషన్ ప్రాంతంలోని బీలింగ్ హాట్‌స్ప్రింగ్ హోటల్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న 100 మంది అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో దాదాపు మూడున్నర గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంటల కారణంగా హోటల్‌లో చిక్కుకున్న 20 మందిని అధికారులు కాపాడగలిగారు. ప్రమాదంలో 16 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 18 మంది గాయపడ్డారు. హోటల్‌లో చిక్కుకున్న 70 మంది రక్షించి వేరే ప్రాంతానికి తరలించారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Untitled Document
Advertisements