మేఘాలయ సిఎం సింగ్మా విజయభేరి

     Written by : smtv Desk | Mon, Aug 27, 2018, 02:34 PM

మేఘాలయ సిఎం సింగ్మా విజయభేరి

మేఘాలయ ముఖ్యమంత్రి, ఎన్‌పీపీ అధ్యక్షుడు కన్రాడ్‌ సంగ్మా దక్షిణ తురా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఈనెల 23న జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి చార్లెట్‌ మొమిన్‌పై ఆయన 8400 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

సంగ్మా గెలుపుతో మేఘాలయ అసెంబ్లీలో ఎన్‌పిపి సంఖ్యాబలం 20కి పెరిగి కాంగ్రెస్‌తో సమానమైంది. ఈ ఏడాది మార్చిలో మేఘాలయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలోల ఎన్‌పిపి 19, కాంగ్రెస్ 20 సీట్లను గెలుచుకున్నాయి. బిజెపి , ఎన్‌సిపి, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఎన్‌పిపి మేఘాలయ డెమోక్రటిక్ అలియన్స్‌గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కాన్రాడ్ సంగ్మా సిఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన సిఎంగా కొనసాగాలంటే ఆరు నెలల్లో ఎంఎల్‌ఎగా గెలువాల్సిన అవసరం ఉంది.

దీంతో మార్చిలో జరిగిన ఎన్నికల్లో దక్షిణ తురా నుంచి ఎంఎల్‌ఎగా గెలిచిన సంగ్మా సోదరి అగధ సంగ్మా తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.





Untitled Document
Advertisements