బ్రాడ్‌మన్‌కు గూగుల్‌ ఘన నివాళి

     Written by : smtv Desk | Mon, Aug 27, 2018, 04:18 PM

బ్రాడ్‌మన్‌కు గూగుల్‌ ఘన నివాళి

ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ క్రికెట్ లెజెండ్ సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ 110వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆయనకు ఘనంగా నివాళులర్పించింది.ప్రపంచంలోనే మేటి ఆటగాడిగా పేరొందిన బ్రాడ్‌మాన్ ఆస్ట్రేలియాలోని కూటముంద్రలో 1908, ఆగష్టు 27న జన్మించాడు. తిరుగులేని టెస్ట్ క్రికెటర్‌గా పేరొందిన బ్రాడ్‌మన్ 52 మ్యాచ్‌ల్లో 12 డబుల్ సెంచరీలు, 29 సెంచరీలు సాధించాడు. ఇంగ్లాండ్‌పై 334 పరుగులు ఆయన సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు.

1930 యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌మన్ ఏకంగా 974 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడు బ్రాడ్‌మాన్ (961 పాయింట్లు) కావడం విశేషం.

Untitled Document
Advertisements