డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్

     Written by : smtv Desk | Tue, Aug 28, 2018, 12:11 PM

డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్

డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న స్టాలిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.0ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి స్టాలిన్.. మూడో అధ్యక్షుడు కావడం గమనార్హం. అదే విధంగా, డీఎంకే పార్టీ కోశాధికారిగా దురై మురుగ‌న్‌ను ఎన్నుకున్నారు. మంగళవారం జ‌రిగిన‌ జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టాలిన్ ఎన్నిక‌పై నిర్ణయం తీసుకున్నారు. 14ఏళ్ల వయసు నుంచే స్టాలిన్ పార్టీకి సేవలు అందించారు. దీంతో పార్టీలో స్టాలిన్‌కు ప్రత్యేక స్థానం కల్పించారు క‌రుణానిధి.

తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు ఎం కరుణానిధి ఈనెల 7న మరణించడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. పార్టీ అధ్యక్ష పదవికి 65 మంది జిల్లా కార్యదర్శులు ప్రతిపాదించగా స్టాలిన్‌ ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు.మరోవైపు తనను పార్టీలోకి తిరిగి తీసుకోని పక్షంలో పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని కరుణానిధిచే డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన స్టాలిన్‌ సోదరుడు ఎంకే అళగిరి హెచ్చరించారు. పార్టీని నడిపించే సమర్ధత స్టాలిన్‌కు లేదని విమర్శించారు. తన తండ్రికి శ్రద్ధాంజలి ఘటించేందుకు అళగిరి సెప్టెంబర్‌ 5న మౌన ర్యాలీ చేపట్టనున్నారు. కరుణానిధి మరణం నేపథ్యంలో పార్టీ శ్రేణుల నుంచి తిరుగులేని మద్దతుతో తాను అధ్యక్ష పగ్గాలు చేపడుతున్నానని అళగిరి వ్యాఖ్యలకు స్టాలిన్‌ దీటుగా బదులిచ్చారు.

1969లో అన్నాదురై మరణానంతరం కరుణానిధి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 50 ఏళ్లపాటు కలైంజర్ అధ్యక్షుడిగగా కొనసాగారు. 2017 జనవరి నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న స్టాలిన్.. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. స్టాలిన్ ఎన్నికతో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి





Untitled Document
Advertisements