గూగుల్ భారీ విరాళం, రూ.7 కోట్లు

     Written by : smtv Desk | Tue, Aug 28, 2018, 07:10 PM

గూగుల్ భారీ విరాళం, రూ.7 కోట్లు

భారీ వర్షాలకు అతలాకుతలమైన కేరళకు టెక్కి దిగ్గజం గూగుల్ ఆపన్న హస్తం ఇచ్చింది.గూగుల్ ఒక మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో దాదాపు రూ.7 కోట్లు విరాళంగా ఇచ్చింది.

ఏడుకోట్ల రూపాయలు ఇస్తున్నట్లు మంగళవారం గూగుల్ కంపెనీకి చెందిన అధికారులు వెల్లడించారు.‘కేరళలో సహాయక చర్యల కోసం గూగుల్‌. ఆర్గ్‌, గూగుల్‌ సిబ్బంది కలిపి 1 మిలియన్‌ డాలర్ల విరాళం ఇస్తున్నాం’ అని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(ఆగ్నేయ ఆసియా, ఇండియా) రాజన్‌ ఆనందన్‌ దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు.

. కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి గూగుల్ క్రైసిస్ రెస్పాన్స్ టీమ్ పలు రకాల చర్యలను చేపట్టింది. ప్రకటించింన విరాళం మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపనుంది.

Untitled Document
Advertisements