రైల్వేస్టేషన్‌లలో వైఫై సేవలు

     Written by : smtv Desk | Wed, Aug 29, 2018, 02:11 PM

రైల్వేస్టేషన్‌లలో వైఫై సేవలు

వచ్చే ఆరు నెలల్లో 6వేల రైల్వే స్టేషన్‌లలో వైఫై సేవలు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించడం వల్ల ప్రయాణికులకులతో పాటు వ్యవసాయ పనులు చేసే వారికి, ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద’న్నారు. అంతే కాకుండా విద్యార్థులకు, రైతులకు, ఉద్యోగాలు చేసే మహిళలకు కూడా ఎంతో ఉపయోగకరమని అన్నారు.’

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... రైల్వేశాఖను నూతన టెక్నాలజీతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను దేశం మొత్తం విస్తరించి సాంకేతికతను మారుమూల పల్లెల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.





Untitled Document
Advertisements