హరికృష్ణ మృతిపట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

     Written by : smtv Desk | Wed, Aug 29, 2018, 03:22 PM

 హరికృష్ణ మృతిపట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ మృతి టీడీపీకి, ఆంధ్రప్రదేశ్‌కు తీరని లోటు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన చెందారు. హరికృష్ణ మృతిపట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగా హరికృష్ణ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు చంద్రబాబు.

ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటనాస్థలానికి వెళ్లాలని, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినా ఆయన్ను కాపాడుకోలేకపోయామని సీఎం ఆవేదన చెందారు. హరికృష్ణ మృతి టీడీపీకే కాదు, తెలుగువారికి తీరని లోటని, ఆ లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు.

ఆసుపత్రిలో హరికృష్ణ భౌతికకాయాన్ని చూసిన చంద్రబాబు, లోకేష్ లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటిపర్యంతమయ్యారు.

Untitled Document
Advertisements