స్వర్ణమందుకున్న జిన్సన్

     Written by : smtv Desk | Thu, Aug 30, 2018, 07:39 PM

స్వర్ణమందుకున్న జిన్సన్

ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల పట్టికలోకి మరో స్వర్ణం వచ్చి చేరింది. పురుషుల 1500 మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్ జిన్సన్ జాన్సన్ స్వర్ణం కొల్లగొట్టాడు. జిన్సన్ జాన్సన్ సాధించిన స్వర్ణంతో భారత్‌కు మొత్తం 12 స్వర్ణాలు వచ్చినట్లు అయింది. ఫైనల్ పోటీల్లో 3:44.72ల కాల వ్యవధిలో అతను నిర్దిష్ట దూరాన్ని దాటగలిగాడు. ఈ పతకంతో భారత్ ఖాతాలో 12 స్వర్ణాలు 20 రజతాలు 25 కాంస్యాలు వచ్చి చేరినట్లు అయింది.

Untitled Document
Advertisements