కుమారస్వామితో చంద్రబాబు భేటీ

     Written by : smtv Desk | Fri, Aug 31, 2018, 11:03 AM

కుమారస్వామితో చంద్రబాబు భేటీ

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. విజయవాడలోని గేట్ వే హోటల్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు. కుమారస్వామి ఇంద్రకీలాద్రిపై వెంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామిని చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిసిననంతరం ఇద్దరూ భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరి భేటీ సాగింది. ఈ భేటీలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా తాము కలిసినట్లు ప్రాథమికంగా కొన్ని చర్చలు జరిపినట్లు తెలిపారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొనేవిధంగా అన్ని ఆలోచిస్తున్నామని చెప్పారు. ఎన్డీయేను ఓడించడమే లక్ష్యంగా కలిసొచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొనిపోతామని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తీసుకురావాలని .. దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు కలవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మరోసారి భేటీ కావాలని నిర్ణయించామని తెలిపారు.

Untitled Document
Advertisements