273 పరుగులకు ఆలౌట్ అయిన భారత్

     Written by : smtv Desk | Sat, Sep 01, 2018, 11:13 AM

273 పరుగులకు ఆలౌట్ అయిన భారత్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మన్‌ మరోసారి తడబాటుకు గురయ్యారు. 273 పరుగుల వద్ద భారత్‌ చివరి వికెట్‌ను కోల్పోయింది.తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌పై భారత్ 27 పరుగుల ఆధిక్యం సాధించింది. ఛటేశ్వర్ పుజారా తన కెరీర్‌లో 15వ టెస్ట్ సెంచరీ సాధించాడు. భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా 132, కోహ్లీ 46, ధావన్ 23, కేఎల్ రాహుల్ 19, ఇషాంత్ శర్మ 14, రహానే 11 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అలీ 5, బ్రాడ్ 3 వికెట్లు తీశారు. కర్రాన్, స్టోక్స్ చెరో వికెట్ తీశారు.

Untitled Document
Advertisements