ఆసియా కప్‌కు జట్టు ఎంపిక

     Written by : smtv Desk | Sat, Sep 01, 2018, 04:50 PM

ఆసియా కప్‌కు జట్టు ఎంపిక

సెప్టెంబర్‌ 15 నుంచి దుబాయ్‌, అబుదాబి వేదికగా ప్రారంభం కానున్న ఆసియాకప్‌‌ కోసం సెలక్టర్లు జట్టును ప్రకటించారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఆసియా కప్‌ నుంచి విశ్రాంతినిచ్చింది. కెప్టెన్‌ గా బాధ్యతలను రోహిత్‌ శర్మకు అప్పగించింది. వైస్‌ కెప్టెన్‌ గా శిఖర్‌ ధావన్‌ ను నియమించింది.వచ్చే మూడు నెలల్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో భారత్ టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు కోహ్లికి విశ్రాంతి ఇచ్చారు.

ఇటీవల నిర్వహించిన యో-యో టెస్టులో పాసైన అంబటి రాయుడు.. ఇండియా ఏ తరఫున రాణించాడు. దీంతో ఆసియా కప్‌కి అతణ్ని ఎంపిక చేశారు. ఇండియా-బి తరఫున 306 పరుగులు చేయడంతోపాటు.. ఆ జట్టును విజేతగా నిలిపిన మనీశ్ పాండేకు కూడా భారత జట్టులోకి పిలుపు దక్కింది.

భారత్‌ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, ధోనీ, దినేష్ కార్తీక్, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజ్‌వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్.

Untitled Document
Advertisements