చెత్త రికార్డు సాధించిన రిషబ్ పంత్

     Written by : smtv Desk | Sat, Sep 01, 2018, 05:09 PM

చెత్త రికార్డు సాధించిన రిషబ్ పంత్

ఐదు టెస్ట్ ల సీరీస్ లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో ఆరంగేట్ర చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా మంచి ఆటతీరును కనబర్చిన రిషబ్ భారత జట్టు గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా వికెట్ కీపర్ గా అరుదైన రికార్డు సాధించాడు. కానీ బ్యాట్ మెన్ గా అంతే చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు

47వ ఓవర్లో స్టోక్స్‌ వేసిన బౌలింగ్‌లో రహానె ఎల్బీడబ్ల్యూగా ఔటవ్వడంతో రిషబ్‌ పంత్‌ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్‌లో ఉన్న పుజారాతో కలిసి పంత్‌ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ క్రమంలో 29 బంతులాడిన పంత్‌ ఒక్క పరుగు కూడా చేయలేదు. 57వ ఓవర్లో మొయిన్‌ అలీ బౌలింగ్‌లో పంత్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో పంత్‌ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 29 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయని బ్యాట్స్‌మెన్లు జాబితాలో పంత్‌ చోటు దక్కించుకున్నాడు. సురేశ్‌ రైనా, ఇర్ఫాన్‌ పఠాన్‌తో కలిసి సంయుక్తంగా ఈ జాబితాలో కొనసాగుతున్నాడు.

ఈ జాబితాలో ఇప్పటివరకూ ఇర్ఫాన్‌ పఠాన్‌తో కలిసి సురేశ్‌ రైనా సంయుక్తంగా అగ‍్రస్థానంలో కొనసాగుతుండగా, ఇప్పుడు ఆ జాబితాలో రిషబ్‌ చేరిపోయాడు. ఆ తర్వాత స్థానాల్లో మునాఫ్‌ పటేల్‌(28 బంతులు), సంజయ్‌ మంజ్రేకర్‌(25 బంతులు), వీవీఎస్‌ లక్ష్మణ్‌(24 బంతులు)లు ఉన్నారు.

Untitled Document
Advertisements