గెలుపు ఎవరిది

     Written by : smtv Desk | Sun, Sep 02, 2018, 12:07 PM

గెలుపు ఎవరిది

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ పోరాటంతో నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆరంభంలో భారత బౌలర్లు పైచేయి సాధించినట్టు కనిపించినా ఆ తర్వాత పట్టు సడలింది. బట్లర్‌ (122 బంతుల్లో 7 ఫోర్లతో 69) అర్ధ సెంచరీతో రాణించగా రూట్‌ (48), జెన్నింగ్స్‌ (36), స్టోక్స్‌ (30) రాణించారు. భారత బౌలర్లలో షమీ 3, ఇషాంత్‌ శర్మ 2 వికెట్లు తీయగా, బుమ్రా, అశ్విన్‌లకు చెరో వికెట్‌ దక్కింది. ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 8 వికెట్లకు 260 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 233 పరుగుల ఆధిక్యంలో ఉంది. కరన్‌ (67 బంతుల్లో 37 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.

Untitled Document
Advertisements