వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆనం రాంనారాయణరెడ్డి

     Written by : smtv Desk | Sun, Sep 02, 2018, 05:51 PM

 వైసీపీ తీర్థం పుచ్చుకున్న  ఆనం రాంనారాయణరెడ్డి

నెల్లూరు జిల్లా మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆనం రాంనారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. కండువా కప్పి వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న ఆనం ఇవాళ వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో ఆనం చేరికపై వైసీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి ఆయన అనుభవం ఉపయోగపడుతుందన్నారు. అందరం కలిసి ఏకతాటిపై నడిచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.

Untitled Document
Advertisements