నిరుపేదలు, దివ్యాంగులు, సాధువులకు ఫుల్ మీల్స్

     Written by : smtv Desk | Mon, Sep 03, 2018, 01:23 PM

నిరుపేదలు, దివ్యాంగులు, సాధువులకు ఫుల్ మీల్స్

అలహాబాద్‌లో 10 రూపాయిలకే భోజనం అందించనున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పేర ‘యోగి థాలి’ అని దీనికి పేరు
పెట్టారు. అలహాబాద్‌ మేయర్‌ అభిలాషా గుప్త దీనిని ప్రారంభించారు. ఒక ప్రైవేటు వ్యక్తి ఈ థాలీని ఏర్పాటు చేయడం అభినందనీయమని గుప్తా చెప్పారు. దిలీప్‌ అలియాస్‌ కాకె ఈ థాలీని ఏర్పాటు చేశారు. పేదలకు, సన్యాసులు తదితరులకు పది రూపాయిలకే భోజనం అందించనున్నారు. ఎవరూ ఆకలితో నిద్రించకూడదనేది తమ సంకల్పమని ఆయన చెప్పారు.

Untitled Document
Advertisements