కర్నాటక స్థానిక సంస్థల పోరులో కాంగ్రెస్ జోరు

     Written by : smtv Desk | Mon, Sep 03, 2018, 03:00 PM

కర్నాటక స్థానిక సంస్థల పోరులో  కాంగ్రెస్ జోరు

కర్నాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగిస్తోంది. భారతీయ జనతా పార్టీ కాస్తా వెనుకబడింది. కర్ణాటకలో మూడురోజుల క్రితం నగర, పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో 846 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. 307 చోట్ల జేడీఎస్‌ అభ్యర్థులు జయ కేతనం ఎగురవేశారు. 788 స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. షిమోగా, మైసూర్‌, తుముకూరులో మాత్రమే బీజేపీ ఆధిపత్యం కనబర్చింది.

27 సీట్లు ఉన్న షహబాదులో కాంగ్రెస్ 18 సీట్లు, బీజేపీ 5, జేడీఎస్ 1 గెలుచుకుంది. జెవార్గిలో బీజేపీ 17 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్, జేడీఎస్‌లు చెరీ మూడు సీట్లు గెలుచుకున్నాయి. అలంద్‌లో 27 సీట్లకు గాను కాంగ్రెస్, బీజేపీలు చెరీ 13 సీట్లు గెలుచుకోగా, జేడీఎస్ 1 సీటు గెలుచుకుంది. హసన్‌లో జేడీఎస్ ముందంజలో ఉంది. ఉడిపిలో బీజేపీ దూసుకు పోతోంది. ఇక్కడ 35 సీట్లకు గాను బీజేపీ 31 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నాలుగు మాత్రమే గెలుచుకుంది. 102 స్థానాలలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 560, బీజేపీ 499, జేడీఎస్ 178, స్వతంత్రులు 150 సీట్లు గెలుచుకున్నారు.

Untitled Document
Advertisements