ఆటకు కావల్సింది ప్రతిభ.. ఫ్యాషన్‌కాదు: పాండ్యా పై విమర్శలు

     Written by : smtv Desk | Tue, Sep 04, 2018, 11:21 AM

ఆటకు కావల్సింది ప్రతిభ.. ఫ్యాషన్‌కాదు: పాండ్యా పై  విమర్శలు

టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాపై క్రికెట్ అభిమానులు ఆగ్రహాం వ్యక్తం చేస్తు్ననారు. ఫ్యాషన్‌పై కాకుండా మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేనకు 27 పరుగుల ఆధిక్యం లభించినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో తడబడటంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సిరీస్‌ చేజిక్కించుకోవడంలో టీమిండియా ఘోరంగా విఫలమైందని క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సిరిస్‌లో భారత జట్టు వైఫల్యంలో ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా భాగస్వామ్యమే ఎక్కువగా ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు టీమిండియాలో అతడిని ఎందుకు ఉంచాలో కారణం చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు.

"ఒకప్పట్లో మిడిలార్డర్‌ నం.6లో లక్ష్మణ్‌లాంటి లెజెండరీ ఆటగాళ్లు ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆస్థానంలో హార్దిక్‌ పాండ్యe ఉన్నాడు. ఆటకు కావల్సింది ప్రతిభ.. ఫ్యాషన్‌కాదు. ఈ విషయాలన్ని అందరూ త్వరగా గ్రహిస్తారని ఆశిస్తున్నా" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఇదే విషయమై గావస్కర్ స్పందించాడు. ‘భారత జట్టు విరాట్ కోహ్లి మీద అతిగా ఆధారపడుతోంది. అతడు ప్రతిసారి శతకాలు బాదలేడు. కోహ్లి కూడా మనిషే. కోహ్లి, రహానే భాగస్వామ్యం విడిపోయాక.. లోయర్ ఆర్డర్ రాణిస్తుందని భావించాను. 60-70 పరుగులు పెద్ద లక్ష్యమేం కాదు’ అని గావస్కర్ తెలిపాడు.





Untitled Document
Advertisements