మార్పుల్లేకుండానే ఇంగ్లండ్‌ జట్టు

     Written by : smtv Desk | Wed, Sep 05, 2018, 03:49 PM

మార్పుల్లేకుండానే ఇంగ్లండ్‌ జట్టు

ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న ఇంగ్లండ్..భారత్‌తో శుక్రవారం మొదలయ్యే ఐదో టెస్ట్‌కు మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతున్నది. గాయం నుంచి వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో కోలుకోవడంతో అతనికి రిజర్వ్‌గా ఉన్న జేమ్స్ విన్స్‌ను జట్టు నుంచి తొలిగించారు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌లో బిజీగా ఉన్న యువ క్రికెటర్ ఒలీవర్ పోప్‌తో పాటు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ తిరిగి జట్టులోకి వచ్చారు.

జట్టు వివరాలు: జోరూట్(కెప్టెన్), జెన్నింగ్స్, బెయిర్‌స్టో, బట్లర్, పోప్, మొయిన్ అలీ, రషీద్, కర్రాన్, జేమ్స్ అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్.

Untitled Document
Advertisements