అక్టోబర్ 2న యువనేస్తం ప్రారంభం

     Written by : smtv Desk | Wed, Sep 05, 2018, 06:15 PM

అక్టోబర్ 2న యువనేస్తం ప్రారంభం

* యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దు.

* పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందాం.

* అమరావతి బాండ్లపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదు
ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి : యువనేస్తం (నిరుద్యోగ భృతి) పథకాన్ని అక్టోబర్ 2న ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో ఈరోజు జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమాతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా 300 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణకు చెందిన బిల్లులను నాలుగు రోజుల్లో క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కక్షకట్టినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు రానప్పుడు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

Untitled Document
Advertisements