డీఎస్సీ ద్వారా మరో 10 వేల పోస్టులు

     Written by : smtv Desk | Wed, Sep 05, 2018, 06:38 PM

 డీఎస్సీ ద్వారా మరో 10 వేల పోస్టులు

ఈ రోజు గురు పూజోత్సవం సందర్బంగా అందరూ తమ గురువులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే డీఎస్సీ ద్వారా మరో 10 వేల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపి నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించారు.మంగళగిరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… నా జీవితంలో గురువుల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. మెరిట్ ఆధారంగా ఆన్‌లైన్ ద్వారా ఉత్త టీచర్లను అవార్డులకు ఎంపిచేశామన్న బాబు.. రాష్ట్రంలో అత్యధికంగా విద్యాశాఖపైనే ఖర్చు చేస్తున్నామని, బోధనలలో అత్యుత్తమంగా ఆంధ్రప్రదేశ్ ను తయారుకావాలన్నారు.

సమాజాన్ని ఎక్కువ ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు టీచర్లేనన్న చంద్రబాబు… ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు ఆహ్లాదంగా గడిపే వాతావరణం రావాలని ఆకాక్షించారు.

Untitled Document
Advertisements