పవర్‌ స్టార్‌ సినిమా వచ్చేస్తుంది !

     Written by : smtv Desk | Wed, Sep 05, 2018, 08:30 PM

పవర్‌ స్టార్‌ సినిమా వచ్చేస్తుంది !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్ని వదిలేసి ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యారు. ఇకపై పవన్‌ సినిమాలు చేసే అవకాశం ఉండదని ఇన్నాళ్లు అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ ఎన్నికలకు వెళ్లే ముందు ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట.

దీనివలన రాబోయే ఎన్నికల కోసం పార్టీలో, కార్యకర్తల్లో, అభిమానుల్లో నూతన ఉత్తేజం నిండే అవకాశముంటుందనేది పవన్‌ భావిస్తున్నారట. ఈ విషయమై ఆయన శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులతో చర్చంచి తన తుది నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Untitled Document
Advertisements