కోహ్లీ - రోహిత్ మధ్య విభేదాలు?

     Written by : smtv Desk | Thu, Sep 06, 2018, 11:59 AM

కోహ్లీ - రోహిత్ మధ్య విభేదాలు?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్త ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనికి కారణం కూడా బలంగానే ఉండడంతో చర్చకు తెరపడడం లేదు.టెస్ట్ జట్టుల్లో తనకు చోటు ఇవ్వకపోవడంతో కోహ్లీపై అలిగిన రోహిత్.. సోషల్ మీడియాలో అతడిని అన్‌ఫాలో చేశాడన్న వార్త గుప్పమంది.

దీంతో ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పాలంటూ ఆ ఇద్దరిని ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైన ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఈ వివాదంపై ఇంతవరకు కోహ్లీ గానీ, రోహిత్ గానీ స్పందించలేదు.

Untitled Document
Advertisements