కుట్ర రాజకీయాలకు కేరాఫ్ జగన్

     Written by : smtv Desk | Thu, Sep 06, 2018, 12:52 PM

కుట్ర రాజకీయాలకు కేరాఫ్ జగన్

* ఫ్యాక్షన్‌ పునాదుల మీద వైసీపీ ఏర్పడింది.

* జగన్‌కు తెదేపాలో చేరిన ఎమ్మెల్యేల బహిరంగ లేఖ.

అమరావతి: కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్ అని తెదేపా ఎమ్మెల్యేలు అన్నారు. ‘ఫ్యాక్షన్‌ పునాదుల మీద నిర్మితమైన మీ ఫ్యూడల్‌ మనస్తత్వాన్ని సమర్ధించలేక.. మానసిక సంఘర్షణ అనుభవించలేక.. ప్రజల కోసం ప్రజాస్వామ్యంవైపు అడుగులేశాం. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేసే ముఖ్యమంత్రిని బలపరిచాం’ అని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిపై ఆ పార్టీ నుంచి వచ్చి తెదేపాలో చేరిన ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ‘అధికారమే పరమావధిగా..కుట్ర రాజకీయాలే ప్రధాన అజెండాగా కొనసాగుతూ..
ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా చూసే మీ నీచ మనస్తత్వాన్ని సహించలేకపోయాం.. ప్రజలకు మేలు చేయాలనే తపనతో మేమిచ్చే సలహాలు వినే నైజం మీకు లేదు. సహనిందితుల సలహలతోనే ముందుకు సాగాలన్న మీ ఆలోచననూ భరించలేకపోయాం’ అని పేర్కొన్నారు. తాము చంద్రబాబుకు ఎందుకు మద్దతు పలకాల్సి వచ్చిందో వివరిస్తూ వారంతా 6 పేజీల బహిరంగ లేఖ రాశారు.
ఇందులో అనేక అంశాలు ప్రస్తావించారు.

లేఖలో విషయాలివీ...
* మీ నాన్న రాజకీయ పుట్టుక ఫిరాయింపులతో మొదలైందనే విషయం గుర్తు లేదా? ‘మధుపర్కాలతో.. మంగళ సూత్రాలతో పెళ్లిపీటల మీద నుంచి వెళ్లిపోయిన కొత్త పెళ్లి కూతురిలా రాజశేఖరరెడ్డి మీ (మర్రి చెన్నారెడ్డి) వైపు వచ్చారు. ఏముంది మీలో ఆకర్షణ’ అని ఆనాటి రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు భాట్టం శ్రీరామమూర్తి శాసనసభలో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోండి.

* 1978లో రెడ్డి కాంగ్రెస్‌ టిక్కెట్టు మీద గెలిచిన మీ నాన్న తర్వాత రాజీనామా చేయకుండానే ఇందిరా కాంగ్రెస్‌లో చేరి మంత్రిగా పని చేయలేదా? 1993లో ఏడుగురు తెదేపా ఎంపీలను కాంగ్రెస్‌లోకి లాక్కోలేదా? అణు ఒప్పందంపై పార్లమెంటులో ఓటింగ్‌ సందర్భంగా
ఇద్దరు తెదేపా ఎంపీలను లాక్కుని పదవులు ఇచ్చిన విషయం గుర్తు లేదా? 2009లో బాలనాగిరెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డిని తీసుకున్నప్పుడు ఎందుకు రాజీనామాలు చేయించలేదు? 2004లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు 10 మందిని తీసుకున్నప్పుడు మీ నాన్న చేసింది పవిత్ర ప్రజాస్వామ్య యజ్ఞమా? అప్పుడు విలువలు ఏమయ్యాయి? ఇప్పుడు రూ.30 కోట్లు అంటున్నావు.. ఆ రోజు మీ నాన్న ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారు? కోర్టుల చుట్టూ తిరిగే మీరు.. మీ బంట్రోతులు.. విలువల గురించి మాట్లాడటమా?

* ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభను ఉపయోగించుకోకుండా గైర్హాజరు కావడం నీ అసమర్ధతా? పారిపోవడమా? మూర్ఖత్వమా?

* ఆస్తుల పరిరక్షణ, కేసుల నుంచి విముక్తి కోసం రాష్ట్రానికి ద్రోహం చేసే నరేంద్ర మోదీ ముందు మోకరిల్లారు.





Untitled Document
Advertisements