సుప్రీంకోర్టు సంచలన తీర్పు

     Written by : smtv Desk | Thu, Sep 06, 2018, 01:12 PM

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

* స్వలింగ సంపర్కం నేరం కాదు
* చారిత్రక తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమా.. కాదా.. చాన్నాళ్లుగా జరుగుతున్న చర్చ ఇది. అయితే ఈ చర్చకు సుప్రీంకోర్టు తన చరిత్రాత్మకమైన తీర్పు ద్వారా తెరదించింది. 377పై గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. స్వలింగ సంపర్కానికి ఉన్నత న్యాయస్థాపం చట్టబద్ధత కల్పించింది. గే సెక్స్ క్రిమినల్ చర్య కాదని వెల్లడించింది. ఎల్‌జీబీటీ( లెస్బియన్‌, గే, బై సెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌) కమ్యూనిటీ లైంగిక ప్రాధామ్యాలను పరిరక్షించేందుకు ఐపీసీ సెక్షన్‌ 377ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ చరిత్రాత్మక తీర్పు వెలువడగానే పలువురు సెలబ్రిటీలు దీనికి మద్దతుగా ట్వీట్లు చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్, రచయిత చేతన్ భగత్, కాంగ్రెస్ నేత శశి థరూర్ తీర్పుపై స్పందించిన వాళ్లలో ఉన్నారు. వీళ్లంతా సుప్రీం తీర్పును స్వాగతించారు.





Untitled Document
Advertisements