చెన్నైలో సిబిఐ ఏకకాల దాడులు

     Written by : smtv Desk | Thu, Sep 06, 2018, 01:41 PM

చెన్నైలో  సిబిఐ ఏకకాల దాడులు

* నిందితులలో ఆరోగ్యమంత్రి, మాజీ డిజిపి
* సుమారు 40 ప్రాంతాల్లో దాడులు

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో గుట్కా కుంభకోణం అధికార పార్టీ పునాదులను కదిలిస్తోంది. ఈ స్కామ్‌కు సంబంధించి రాష్ట్ర మంత్రి, పోలీస్ ఉన్నతాధికారి అయిన డీజీపీ, మాజీ డీజీపీ గృహాలపై సీబీఐ దాడులు నిర్వహించడం సంచలనం కలిగించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి. విజయభాస్కర్, రాష్ట్ర డీజీపీ టీకే రాజేం ద్రన్‌ల ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. వందల కోట్ల విలువైన గుట్కా స్కాంకు సంబంధించి బుధవారం తెల్లవారుజాము నుంచి ఈ దాడులు మొదలయ్యాయి. ఉదయం 7 గంటలకు ఏక కాలంలో 40 ప్రదేశాలలో సీబీఐ అధికారులు మోహరించారు. వీళ్లిద్దరితో పాటు మాజీ డీజీపీ ఎస్. జార్జి సహా మరికొందరు సీనియర్ పోలీసు అధికారుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరిగాయని మాత్రమే సీబీఐ అధికారులు తెలిపారు తప్ప మిగిలిన వివరాలు వెల్లడించలేదు. తమిళనాడులోని కొన్ని పాన్ మసాలా, గుట్కా తయారీ కేంద్రాలు, వాటి తయారీదారుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు 2017 జూలై 8న దాడులు చేశారు. అప్పుడే గుట్కా స్కాం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 250 కోట్ల మేర పన్నులు ఎగవేసి నట్లు తెలిసింది. దాడుల సమయంలో అక్కడ ఒక డైరీ దొరికింది. అందులో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి. విజయ భాస్కర్, రాష్ట్ర డీజీపీ టీకే రాజేంద్రన్‌ల పేర్లున్నా యి. గుట్కా తయారీదా రుల నుంచి మంత్రి, డీజీపీ తీసుకున్న లంచాల బాగోతాలన్నీ బయట పడ్డాయి. కేన్సర్ కారకాలైన గుట్కా, పాన్‌మసా లాల తయారీ, విక్రయాలను 2013లోనే తమిళ నాడులో నిషేధించారు. అయినా అవి యథేచ్ఛగా మార్కెట్లలోకి వస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో తమిళనాడు కాకా ఇతర ప్రాంతాలలో గుట్కాలు ప్రభుత్వం నిషేదించిన అన్ని చోట్ల అమ్ముతూనే ఉన్నారు. ఇది ఒక మాఫియాగా తయారైందని వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.







Untitled Document
Advertisements