అక్టోబర్ 4న నోటా

     Written by : smtv Desk | Fri, Sep 07, 2018, 01:13 PM

అక్టోబర్ 4న  నోటా

టాలీవుడ్ సెన్సేషన్ విజయ దేవరకొండ గీత గోవిందం హిట్ తో సంతోషంగా ఉన్నాడు, తన తదుపరి చిత్రం నోటా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ సామజిక మాధ్యమాల్లో దుమ్ము రేపుతోంది , సెలెబ్రటీస్ నుండి ప్రశంశల వర్షం కురుస్తుంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెలుగు .. తమిళ భాషల్లో 'నోటా' సినిమా రూపొందింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, అక్టోబర్ 4వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దసరా రోజుల్లో తెలుగు .. తమిళ భాషల్లో గట్టిపోటీనే వుంది. అందువలన కాస్త ముందుగానే ఈ సినిమాను విడుదల చేయడం మంచిదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.

Untitled Document
Advertisements