టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

     Written by : smtv Desk | Fri, Sep 07, 2018, 04:01 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య మరికొద్దిసేపట్లో చివరిదైన ఐదో టెస్టు ప్రారంభం కానుంది. లండన్‌‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో మూడింటిలో గెలిచిన ఇంగ్లండ్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. అశ్విన్ స్థానంలో జడేజా, హార్దిక్ పాండ్యా స్థానంలో హనుమా విహారీలకు తుది జట్టులో స్థానం లభించింది.

ఇంగ్లండ్ జట్టు: అలిస్టర్ కుక్, కీటన్ జెన్సింగ్స్, మొయిన్ అలీ, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, శామ్ కర్రన్, ఆదిల్ రషీద్, స్టువార్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

భారత జట్టు: శిఖర్ ధవన్, లోకేశ్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, హనుమా విహారీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా

Untitled Document
Advertisements