ఈ నెల 13వ తేదీన '2.ఓ' టీజర్

     Written by : smtv Desk | Fri, Sep 07, 2018, 05:14 PM

ఈ నెల 13వ తేదీన  '2.ఓ' టీజర్

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం కుదరటం లేదు.ఇప్పటికే చాలా సార్లు టీజర్‌ రిలీజ్‌పై వార్తలు వినిపించాయి. ఇటీవల ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజర్ రిలీజ్‌ అవ్వటం కన్ఫామ్‌ అన్న ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు కూడా టీజర్ రిలీజ్‌ కాలేదుఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను శంకర్ ఎనౌన్స్ చేశాడు. 'వినాయకచవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 13వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నట్టు చెప్పాడు. రజనీ అభిమానులందరికీ ఇది శుభవార్తేనని చెప్పాలి. ఈ టీజర్ తో శంకర్ ఏ స్థాయిలో అంచనాలు పెంచుతాడో చూడాలి. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, కథానాయికగా ఎమీ జాక్సన్ నటించిన సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements