పాక్‌ ఆర్మీ చీఫ్‌ సంచలన కామెంట్స్

     Written by : smtv Desk | Fri, Sep 07, 2018, 06:57 PM

పాక్‌ ఆర్మీ చీఫ్‌ సంచలన కామెంట్స్

దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి కపట బుద్ధిని ప్రదర్శించింది. భారత్‌ చెరలో ఉన్న కశ్మీర్‌కు విముక్తి కలిగిస్తామంటూ ప్రగల్భాలు పలికింది. ఓవైపు.. భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చెబుతుంటే... మరోవైపు పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ బజ్వా మాత్రం భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తమ సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని వ్యాఖ్యానించారు. జమ్ము కాశ్మీర్ ప్రజలకు వందనాలు అని వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్‌ రక్షణ రంగం వెబ్‌సైట్‌ కథనం ప్రకారం... భారత్‌లో ఉన్న కాశ్మీర్‌కు విముక్తి కలిగిస్తామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్నారు. పాకిస్తాన్ రక్షణ రంగం వెబ్ సైట్ కథనం ప్రకారం.. కాశ్మీర్ ప్రజలు ఎంతో ధైర్య సాహసాలతో పోరాడుతున్నారని, వారికి విముక్తి కలిగించేందుకు మా వంతు సహకారం చేస్తామని, కాశ్మీర్‌లోని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల త్యాగాలకు సలాం చేస్తున్నామని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన మా సైనికుల మృతికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని వ్యాఖ్యానించారు. ఆయన 53వ డిఫెన్స్ డే సందర్భంగా రావల్ఫిండిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

Untitled Document
Advertisements