నోటా ట్రైలర్ టాక్.

     Written by : smtv Desk | Fri, Sep 07, 2018, 07:47 PM

నోటా ట్రైలర్ టాక్.

యువ హీరో విజయ్ దేవరకొండ గీతా గోవిందం ఇంకా థియేటర్ లో సందడి చేస్తుండగానే మరో సెన్సేషనల్ మూవీతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. తెలుగు, తమిళ భాషల్లో ఆనంద్ రంగ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా నోటా. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞావెల్ రాజా ఈ సినిమా నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సిఎంగా కనిపిస్తాడని తెలుస్తుంది.

ఈమధ్యనే సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాలో సిఎంగా కనిపించి అలరించాడు. ఇప్పుడు నోటా కోసం విజయ్ కూడా సిఎం సీటు ఎక్కినట్టు ఉన్నాడు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. సినిమాలో విజయ్ లుక్ ప్రేక్షకులకు మరింత నచ్చేస్తుందని చెప్పొచ్చు. ట్రైలర్ లో డైలాగ్స్ కేక పెట్టించాయి. ఫైనల్ గా ఇక్కడ లైఫ్ ఆర్ డెత్ అంటూ చెప్పడం బాగుంది. ట్రైలర్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించిన విజయ్ ఈ సినిమాతో కూడా పక్కా హిట్ కొడతాడని అనిపిస్తుంది.Untitled Document
Advertisements