స్టైలిష్‌ లుక్‌లో రజినీకాంత్

     Written by : smtv Desk | Fri, Sep 07, 2018, 08:07 PM

స్టైలిష్‌ లుక్‌లో రజినీకాంత్

సూపర్‌స్టార్ రజనీకాంత్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్‌ను పెట్టగా ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ‘పెట్ట’.. ఓ పాడుబడ్డ ఇంట్లో లైట్ స్టాండ్ తో వస్తుంటాడు రజినీ.. ఓ కత్తి వేగంగా అటువైపు వస్తుంది.. తన స్టాండ్ తో కత్తిని ఆపేస్తాడు. ఇదే మోషన్ తో ఉన్న పోస్టర్. రజినీకాంత్ లుక్ మరోసారి మాస్ కా బాప్ అన్నట్టుగా అదిరిపోయింది. ఇక అత్యంత భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ మూవీని సన్ ప్రొడక్షన్స్ అధినేత కలైనిధి మారన్ నిర్మిస్తున్నాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి విలన్స్ గా నటిస్తుండటం విశేషమైతే.. చాలా రోజుల తర్వాత నటి సిమ్రన్ ఈ మూవీలో విలన్ గా రీ ఎంట్రీ ఇస్తోంది.Untitled Document
Advertisements