అభిమానులకు జనసేన పిలుపు

     Written by : smtv Desk | Sat, Sep 08, 2018, 11:46 AM

అభిమానులకు జనసేన పిలుపు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వాన్ని పెంచుకొనే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా పవన్ కల్యాణ్ అభిమానులకు ‘జనసేన’ ఓ పిలుపు నిచ్చింది.సినిమా రిలీజ్‌ అయితే థియేటర్‌ వద్ద చేసిన సంబరాల మాదిరిగానే ఇప్పుడు గ్రామ గ్రామానా సభ్యత్వ నమోదుతో సందడి చేయాలని పిలుపునిచ్చింది. సినిమా థియేటర్లను అలంకరించేబదులుగా ఆయా గ్రామాలు, నగరాల్లో జెండా దిమ్మలు ఏర్పాటు చేయాలని అభిమానులను కోరింది. రికార్డులు బద్దలు కొట్టాలంటే 09-09-2018 లోపు ఒక్కొక్కరూ వంద సభ్యత్వాల చొప్పున చేర్పించడంతో పాటు పదిమంది కలిసి జెండా దిమ్మలు ఏర్పాటు చేయాలని, పవన్ కల్యాణ్ అభిమానుల సత్తా చాటాలని ‘జనసేన’ పిలుపు నిచ్చింది.

Untitled Document
Advertisements