ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌

     Written by : smtv Desk | Sat, Sep 08, 2018, 12:47 PM

 ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఇద్దరు ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ జమ్మూకశ్మీర్‌(ఐఎస్‌జేకే) ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్‌చేశారు. కశ్మీర్‌కు చెందిన ఈ ఇద్దరు ఎర్రకోట సమీపంలోని బస్టాండ్‌‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాకు చెందిన పర్వేజ్‌, జంషెద్‌గా గుర్తించారు.వీరి వద్ద ఇంపోర్టెడ్‌ పిస్టోళ్ల లాంటి అధునాతన ఆయుధాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్ లో అరెస్ట్ అయిన వారికి.. వీరికి సంబంధముందా లేదా అనేది మాత్రం తెలియలేదు.

Untitled Document
Advertisements