మార్పు రాకపోతే సస్పెండ్ చేస్తా: ముఖ్యమంత్రి

     Written by : smtv Desk | Sat, Sep 08, 2018, 01:08 PM

 మార్పు రాకపోతే  సస్పెండ్ చేస్తా: ముఖ్యమంత్రి

ఉత్తర ఆంధ్ర డెంగ్యూ, మలేరియా ప్రబలడంపై ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిఎంహెచ్ వోలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారుల అలసత్వం వల్లనే ఈ పరిస్థితి అంటూ సీఎం మండిపడ్డారు. ఎన్ని సార్లు చెప్పినా కొందరిలో మార్పు రావడం లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించేది లేదు అని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. పారిశుధ్యం, అనారోగ్య పరిస్థితిలో మార్పు రాకపోతే స్వయంగా డెంగ్యూ, మలేరియా ప్రాంతాల్లో మకాంవేస్తామని సీఎం తెలిపారు.

సోమవారానికి మార్పు రాకపోతే స్పాట్ లోనే పనిచెయ్యని అధికారులను సస్పెండ్ చేస్తా అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అసమర్ధతను, నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తేలేదు.. బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల యోగక్షేమాలు విచారించాలి.. వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందేలా శ్రద్ధ వహించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. వివరణలు, సంజాయిషీలు కాదు నేను కోరుకునేది.. మన కార్యాచరణ ప్రజల కళ్లకు కనిపించాలన్నారు. డెంగ్యూ, మలేరియా ప్రాంతాలకు మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ మరియు వైద్యశాఖ సలహాదారు ఎందుకు వెళ్లలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements