భారత్ లాంటి దేశాలకు సబ్సిడీలను నిలిపివేస్తాం

     Written by : smtv Desk | Sat, Sep 08, 2018, 01:18 PM

భారత్ లాంటి దేశాలకు సబ్సిడీలను నిలిపివేస్తాం

భారత్, చైనా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సబ్సిడీలను నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరిలో కొన్ని దేశాలకు మేం సబ్సీడీలు చెల్లిస్తున్నాం. భారత్‌, చైనా లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలని చెప్పుకొంటూ సబ్సీడీలు పొందుతున్నాయి. కానీ నిజానికి ఆయా దేశాల్లో ఆర్థిక పురోగతి వేగంగా ఉంటోంది. అలాంటప్పుడు సబ్సీడీ ఇవ్వడం అనేది క్రేజీ. అందుకే మేం దాన్ని నిలిపివేయాలని అనుకుంటున్నాం’ అని ట్రంప్‌ తెలిపారు.
ఇక అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమేనని.. అయితే మిగిలిన దేశాలతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమలైతే భారత్ పై అధికంగా ఆర్థిక భారం పడే అవకాశముంది. ఈ ప్రకటనపై భారత ప్రభుత్వం ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Untitled Document
Advertisements