వైరల్ అవుతున్న అఖిల్ యూ-టర్న్ డాన్స్

     Written by : smtv Desk | Sat, Sep 08, 2018, 04:19 PM

వైరల్ అవుతున్న అఖిల్ యూ-టర్న్ డాన్స్

వదిన సమంత కోసం మరది అఖిల్ స్టెప్పులేసి శభాష్ అనిపించాడు. సమంత నటించిన ‘ యూటర్న్’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా అనిరుద్ స్వరపరచిన ‘ కర్మథీమ్ ‘ అనే స్పెషల్ సాంగ్ ఇటీవల రిలీజయింది. ఈ పాటలో ఆమె స్టెప్పులను అనుకరిస్తూ చిన్నారులు కూడా డ్యాన్సులు చేసి వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి..అఖిల్ ఊరుకుంటాడా ? వదిన మాదిరే తానూ డ్యాన్స్ చేసి.. ‘ ఈ వీడియోను మా వదిన కోసం ‘ అనే కామెంట్‌తో పోస్ట్ పెట్టాడు. పైగా సమంతకు అడ్వాన్స్ విషెస్ కూడా చెప్పాడు.

పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ యూటర్న్ ‘ చిత్రం ఈ నెల 13 న విడుదల కానుంది.

Untitled Document
Advertisements