కోర్టు కు హాజరైన నిర్మాత బండ్ల గణేష్

     Written by : smtv Desk | Sat, Sep 08, 2018, 05:33 PM

కోర్టు కు  హాజరైన నిర్మాత బండ్ల గణేష్

చెక్‌‌బౌన్స్‌ కేసులకు సంబంధించి సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ శుక్రవారం ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు.కోర్టులోకి వెళ్తున్న సమయంలో ఆయన ముఖానికి గుడ్డ కట్టుకున్నారు. కేసు వివరాల్లోకి వెళ్తే, ప్రొద్దుటూరుకు చెందిన 68 మంది బండ్ల గణేష్ కు వడ్డీకి డబ్బు ఇచ్చారు. ఆ లావాదేవీలకు సంబంధించి బండ్ల గేణేష్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. . ఆయన ఉదయం ప్రొద్దుటూరుకి వచ్చి తన కారుని జార్జి క్లబ్ లో ఉంచి అక్కడ నుండి కోర్టుకి వెళ్లారు. కంప్లైంట్ చేసిన వారి సమక్షంలోనే న్యాయమూర్తి బండ్ల గణేష్ ని విచారించారు.

దీనికి ఆయన కొంతకాలం సమయం కావాలని కోర్టుని కోరినట్లు తెలుస్తోంది. విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసినట్లు కోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా మీడియా బండ్ల గణేష్ తో మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన నిరాకరించారు. ఎవరికీ కనిపించకుండా మాస్క్ ధరించి కోర్టు నుండి బయటకి వెళ్లిపోయారు.

Untitled Document
Advertisements