కమళదళ అధిపతిగా అమిత్ షా

     Written by : smtv Desk | Sat, Sep 08, 2018, 07:01 PM

 కమళదళ అధిపతిగా అమిత్ షా

అమిత్ షా అంటే వ్యూహాలకు పెట్టింది పేరు. రానున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించాలంటే జాతీయ అధ్యక్షుడుగా అమిత్ షా నే ఉండాలని బీజీపీ జాతీయ కార్యవర్గం భావిస్తుంది.
2019 జనవరిలో జాతీయాధ్యక్షుడిగా అమిత్‌ షా పదవీకాలం ముగియనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పార్టీ సంస్థాగత ఎన్నికలను వాయిదా వేసి అమిత్‌ షా పదవీకాలాన్ని పొడిగించాలని భాజపా భావిస్తోందని తెలుస్తుంది.
2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అన్ని సీట్లు సాధించడం బీజేపీకి అంతసులువైన అంశంకాదు. ఇప్పటికే అధిక పెట్రోల్‌ ధరలు, రాఫెల్‌ ఒప్పదం, నొట్ల రద్దు వంటి అంశాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 లోక్‌సభ ఎన్నికలును బీజేపీ అంత తేలికగా తీసుకోవడంలేదు. దీంతో రానున్న ఎన్నికల్లో అమిత్ షా నాయకత్వం లో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా అమిత్ షా నే ముందుండి నడిపించాడని వచ్చే ఎన్నికల్లో కూడా అమిత్ షా సారథ్యంలోనే వెళ్లాలని బీజీపీ శ్రేణులు భావిస్తున్నారు.

Untitled Document
Advertisements